Thu Jan 29 2026 12:20:32 GMT+0000 (Coordinated Universal Time)
kejrival : మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఆపరేషన్ లోటస్ ప్రారంభమయింది
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్ర జరుగుతుందని ఆయన తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఆపరేషన్ లోటస్ ను ప్రారంభించిందని ఆయన తెలిపారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిందని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
ఏడుగురు ఎమ్మెల్యేలను...
తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలతో బీజేపీ సందప్రదింపులు జరిపిందన్న కేజ్రీవాల్ వారికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పిందని తెలిపారు. కొన్ని రోజుల తర్వాత మనీ లాండరింగ్ కేసులో తనను అరెస్ట్ చేస్తామని, ఆప్ ప్రభుత్వం కూలిపోయాక మంత్రి పదవులు కూడా ఇస్తామని వారికి ఆఫర్ ఇచ్చినట్లు కేజ్రీవాల్ తెలిపారు.
Next Story

