Sun Mar 15 2026 03:29:58 GMT+0530 (India Standard Time)
నేడు గోవాకు కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు గోవాలో పర్యటించనున్నారు. గోవా ఎన్నికల ప్రచారం లో పాల్గొననున్నారు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు గోవాలో పర్యటించనున్నారు. గోవా ఎన్నికల ప్రచారం లో పాల్గొననున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ గోవా, పంజాబ్ లలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. గోవాలో కొంత పట్టు ఉండటంతో ఈసారి కీలకంగా మారాలన్న యోచనలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు.
రెండు రోజులు...
ఈరోజు, రేపు గోవా ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొంటారు. ఇప్పటికే అభ్యర్థులను కొందరిని ఖరారు చేసిన కేజ్రీవాల్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తామే ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. రెండు రోజలు పాటు ఆయన గోవాలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
Next Story

