Thu Mar 19 2026 13:27:39 GMT+0530 (India Standard Time)
మరోసారి విశ్వాస పరీక్షకు సిద్ధమైన కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు. ఆయన గత ఆరు నెలల క్రితం ఒకసారి విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. మళ్లీ మరొకసారి విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు. రేపు విశ్వాస పరీక్ష పై ఢిల్లీ అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఆయన ఆరు నెలలకు ఒకసారి విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్నారు.
ఆరు నెలలకు ఒకసారి...
ఈరోజు విశ్వాస తీర్మానాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ వల వేస్తుందని ఆయన ఇటీవల ఆరోపించారు. అదే సమయంలో తనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనూ, మనీ లాండరింగ్ పేరిట ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఆయన వరసగా విశ్వాస పరీక్షలను ఎదుర్కొంటున్నారు.
Next Story

