Thu Mar 19 2026 15:14:57 GMT+0530 (India Standard Time)
ఆటో డ్రైవర్ ఇంట్లో డిన్నర్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో స్పీడ్ పెంచారు. గుజరాత్ లో పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన చర్యలు చేపట్టారు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో స్పీడ్ పెంచారు. గుజరాత్ లో పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన చర్యలు చేపట్టారు. పంజాబ్ లో గెలిచిన ఉత్సాహంతో గుజారాత్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించేలా ఆయన వ్యూహాలను రచిస్తున్నారు. సామాన్యుల పార్టీగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని పేద, మధ్య తరగతి వర్గాల్లోకి బలంగా తీసుకు వెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.
గుజరాత్ పర్యటనలో...
ఇందులో భాగంగా అహ్మదాబాద్ లో అరవింద్ కేజ్రీవాల్ ఒక ఆటో డ్రైవర్ ఇంట్లో భోజనం చేశారు. ఆ డ్రైవర్ ను ఢిల్లీకి వచ్చి తనను కలవాల్సిందిగా కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కలిసి ఆటోలో డ్రైవర్ విక్రమ్ దంతాని ఇంటికి వెళ్లిన కేజ్రీవాల్ అక్కడే భోజనం చేశారు. అహ్మదాబాద్ లోని ఘట్లోడియా ప్రాంతానికి ఆటో డ్రైవర్ విక్రమ్ తన ఇంటికి భోజనానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. వెంటనే అందుకు అంగీకరించి ఆయన ఇంటకి వెళ్లి భోజనం చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story

