Sun Mar 15 2026 20:56:14 GMT+0530 (India Standard Time)
కోవిడ్ నుంచి కోలుకున్న కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనా నుంచి కోలుకున్నారు. తనకు నెగిటివ్ వచ్చినట్లు ఆయన ట్వీట్ చేశారు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనా నుంచి కోలుకున్నారు. తనకు నెగిటివ్ వచ్చినట్లు ఆయన ట్వీట్ చేశారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆయన చెప్పారు. ఈరోజు 22 వేలకు పైగానే కేసులు నమోదయ్యే అవకాశముందని ఆయన చెప్పారు.
అన్ని రకాలుగా....
కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. వీకెండ్ లాక్ డౌన్ ను విధించింది. సినిమా హాళ్లను మూసివేసింది. నైట్ కర్ఫ్యూను కూడా అమలు చేశారు. ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంటున్నా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుదల మాత్రం ఆగడం లేదు. ప్రజలు తమంతట తామే కోవిడ్ నిబంధనలను పాటించాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు.
Next Story

