Fri Dec 05 2025 20:59:15 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : నేడు నేను హాజరు కాలేను - కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల మరోసారి నోటీసులు ఇచ్చారు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈరోజు విచారణకు హాజరు కావాలని ఆయనను కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలను కేజ్రీవాల్ ఎదుర్కొంటున్నారు. ఆయనకు ఇప్పటికే నాలుగు సార్లు ఈడీ విచారణకు నోటీసులు ఇచ్చింది.
అనేక కారణాలతో...
అయితే వివిధ కారణాలు చెప్పి ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈరోజు ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుటకు హాజరు కానని మరోసారి సమాధానం ఇచ్చారు. ఇటీవలే తన పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిందని, తనను జైల్లో వేస్తామని వారితో చెప్పిందని కేజ్రీవాల్ చేసిన ఆరోపణలతో ఈరోజు ఏం జరుగుతుందన్న టెన్షన్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో నెలకొంది.
Next Story

