Thu Mar 19 2026 03:01:33 GMT+0530 (India Standard Time)
Aravind Kejrival : సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు నిరాశ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో మరోసారి షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో మరోసారి షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈరోజు బెయిల్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగింది. అయితే కేజ్రీవాల్ వేసిన పిటీషన్ పై సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ లభించినా సీఐడీ కేసులో మాత్రం లభించలేదు
బెయిల్ తిరస్కరించడంతో....
హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్ ను తిరస్కరించడంతో ఆయన మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ ఇవ్వకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీలో నిరాశ ఎదురయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులోనే ఉన్నారు. ఆయనకు మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Next Story

