Tue Mar 10 2026 18:33:05 GMT+0530 (India Standard Time)
కీలక నిర్ణయం... గ్యాస్ వినియోగదారులూ అలెర్ట్
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్లపై నియంత్రణ విధిస్తూ నిర్ణయం తీసుకుంది

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్లపై నియంత్రణ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. హోటళ్లకు, సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హాస్టళ్లకు మాత్రమే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
యుద్ఢం జరుగుతున్న పరిస్థితుల్లో...
మధ్య ప్రాచ్యంలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రానున్న కాలంలో ఎల్.పి.జి సమస్య ఏర్పడే అవకాశముందని భావించి ముందస్తు చర్యలను ప్రారంభించింది. అందులో భాగంగా గృహ గ్యాస్ వినియోగదారులందరూ తప్పకుండా ఈ కేవైసీ చేసుకోవాలని సూచించింది. ఈ కేవైసీ చేసుకోని వినియోగదారులకు గ్యాస్ నిలిపివేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story

