Thu Dec 18 2025 17:49:50 GMT+0000 (Coordinated Universal Time)
54కు చేరిన కల్తీసారా మృతుల సంఖ్య
తమిళనాడులో కల్తీసారా మృతుల సంఖ్య 54 కు చేరుకుంది. మరో ఎనభై మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు

తమిళనాడులో కల్తీసారా మృతుల సంఖ్య 54 కు చేరుకుంది. మరో ఎనభై మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే దీనిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నిందితులను అదుపులోకి తీసుకుంది. ఐఏఎస్,ఐపీఎస్ అధికారులపై వేటు వేసింది. చికిత్స పొందుతున్న బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.
నివేదిక వచ్చిన తర్వాత...
కల్తీసారాను గోవిందరాజులు అనే వ్యక్తి విక్రయించడంతో ఇంత మంది చనిపోయారు. ప్రభుత్వానికి ఈ ఘటనపై నేటి సాయంత్రానికి నివేదిక సమర్పించనుంది. నివేదిక చూసిన తర్వాత మరికొందరు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశముంది. కల్తీసారా ఘటనను నిరసిస్తూ నేడు బీజేపీ ఆందోళనలకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు నిచ్చింది.
Next Story

