Thu Mar 19 2026 04:19:10 GMT+0530 (India Standard Time)
కేరళకు వాయుసేన విమానంలో చేరుకున్న 45 మృతదేహాలు
కువైట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన భారతీయుల మృతదేహాాలు కేరళకు చేరుకున్నాయి.

కువైట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన భారతీయుల మృతదేహాాలు కేరళకు చేరుకున్నాయి. కువైట్ లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 49 మంది మరణించారు. ఇందులో అత్యధికంగా భారతీయులే. 45 మంది భారతీయుల్లో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కూడా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం 45 భారతీయుల మృతదేహాలను కేరళలోనే కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకు వచ్చారు.
ఎక్స్‌గ్రేషియో ప్రకటించి...
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో పాటు కేంద్ర మంత్రి సురేష్ గోపి కూడా విమానాశ్రయానికి చేరుకుని వారికి నివాళులర్పించారు. బాధితులకు అండగా నిలిచేందుకు కేరళ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది. మృతుల కుటుంబాలకు భారత ప్రభుత్వం రెండు లక్షలు పరిహారం ప్రకటించింది. వాయుసేన విమానంలో వచ్చిన మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు.
Next Story

