Sun Dec 14 2025 00:21:27 GMT+0000 (Coordinated Universal Time)
Tamil Nadu : తమిళనాడును ముంచెత్తుతున్న వర్షం
మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతున్న నేపథ్యంలో, తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతున్న నేపథ్యంలో, తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. తిరువళ్లూర్ జిల్లాపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈరోజు ఆ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాంచీపురం, తిరునల్వేలి, కన్యాకుమారిలో కుండపోత వర్షం కురుస్తుంది. చెన్నైలో ఎడతెరిపిలేకుండా వర్షం పడుతూనే ఉంది. చెన్నై, తిరువళ్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.
గంటకు వంద కిలోమీటర్ల వేగంతో...
చెన్నై వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం, చెంగల్పట్టు, చెన్నై, కాంచీపురం, రాణిపేట, తిరువళ్లూర్, తిరువన్నామలై, వెల్లూరు, తిరుపత్తూరు, విల్లుపురం, తేంకాశి, తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, తేలికపాటి పిడుగులు, ఈదురుగాలులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో, మత్స్యకారులు అక్టోబర్ 29 వరకు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలోని మొంథా తుపాను ప్రభావంతో 90 నుండి 100 కి.మీ. వేగంతో గాలులు వీచి, 110 కి.మీ. వరకు వేగం పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది
Next Story

