Fri Dec 05 2025 16:19:53 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లోఆరు కోట్లు విలువచేసే డైమండ్ నెక్లెస్ స్వాధీనం
అత్యంత ఖరీదైన నెక్లెస్‌ను అక్రమంగా తరలిస్తుండగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు

అత్యంత ఖరీదైన నెక్లెస్‌ను అక్రమంగా తరలిస్తుండగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఒక ప్రయాణికుడు ఈ నెక్లెస్ తరలిస్తుండగా ఢిల్లీ విమానాశ్రయం అధికారులు అరెస్టు చేశారు. అతడి నుంచి దాదాపు ఆరు కోట్ల విలువ చేసే నెక్లెస్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని కస్టమ్స్ విభాగం అధికారులు ఆదివారం ‘ఎక్స్’లో వెల్లడించారు.
బ్యాంకాంక్ నుంచి...
ఈ నెల 12వ తేదీనన బ్యాంకాక్ నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నఒక ప్రయాణికుడిని తనిఖీ చేసినప్పుడు నెక్లెస్‌ను అక్రమంగా తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వజ్రాలు పొదిగి ఉన్న 40 గ్రాముల ఈ నెక్లెస్ విలువ రూ.6.08 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. . నిందితుడిని గుజరాత్‌కు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story

