Mon Dec 15 2025 07:22:32 GMT+0000 (Coordinated Universal Time)
రద్దీ రోడ్డులో కరెన్సీ నోట్ల వర్షం
బెంగళూరులో రద్దీ రోడ్డుపై కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. ఓ వ్యక్తి ఫ్లైఓవర్ పై నుంచి నోట్లు వెదజల్లడంతో జనం ఎగబడ్డారు

బెంగళూరులో రద్దీ రోడ్డుపై కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. ఒక వ్యక్తి ఫ్లైఓవర్ పై నుంచి నోట్లు వెదజల్లడంతో జనం నోట్ల కోసం ఎగబడ్డారు. దీంతో ట్రాఫిక్ జాం ఏర్పడి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. బెంగళూరులో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఎందుకు నోట్లు పడుతున్నాయో తెలియక అనేక మంది కాసేపు హైరానా పడ్డారు. నోట్ల కోసం కలియబడ్డారు.
ఫ్లైఓవర్ పై నుంచి...
ఫ్లైఓవర్ పై నుంచి సూటు బూటు వేసుకున్న వ్యకి ఈ డబ్బులను విసిరేశాడు. మెడలో గోడగడియారాన్ని తగిలించుకుని వచ్చిన వ్యక్తి సంచిలో నుంచి నోట్ల కట్టలు తీసి కేఆర్ మార్కెట్ ఫ్లైఓవర్ నుంచి జనం పై విసిరాడు. తన పక్కకు వచ్చి తమకు ఇవ్వాలని రోరిన వారికి ఇవ్వకుండా ఆ వ్యక్తి నోట్లను ఫ్లై ఓవర్ పై విసిరేయడం ఎందుకన్న ప్రశ్న అందరిలోనూ కలిగింది. అయితే వెంట వెంటనే విసిరేసి సదరు వ్యక్తి వెళ్లిపోయాడు. అయితే విసిరిన నోట్లన్నీ పది నోట్లుగా చెబుతున్నారు.
Next Story

