Tue Jan 06 2026 10:06:47 GMT+0000 (Coordinated Universal Time)
Sabarimala : పంబ వరకూ క్యూ లైన్
కేరళలోని శబరిమల ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.

కేరళలోని శబరిమల ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. అయ్యప్పస్వామి దర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. డిసెంబర్ 30 నుంచి మకరవిళక్కు దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఐదు లక్షల మందికిపైగా అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని ట్రావెన్ కోర్ ఆలయ స్థానం బోర్డు ప్రకటించింది.
పోటెత్తిన భక్తులు...
మండల పూజల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి రావడంతో ఆలయ ప్రాంగణమంతా శరణమయ్యప్ప శరణులతో మార్మోగిపోతుంది. దర్శనం చేసుకోవడానికి వృద్ధులు, పిల్లలు కూడా తరలి రావడంతో ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈరోజు పంబ వరకు భక్తుల క్యూలైన్ విస్తరించిందని అధికారులు తెలిపారు.
Next Story

