Wed Mar 18 2026 22:48:17 GMT+0530 (India Standard Time)
విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం
సీతారాం ఏచూరి తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం క్షీణించిందని, విషయమంగా ఉందని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. సీతారాం ఏచూరి తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. ప్రస్తుతం ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారని సీపీఐ(ఎం) ఒక ప్రకటనలో తెలిపింది.
తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఉన్న ఆయన్ను ఆగస్టు 19న ఎయిమ్స్‌లోని అత్యవసర విభాగంలో చేర్చారు. న్యుమోనియా కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఇటీవలే కంటిశుక్లం శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆయన ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఏచూరి ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సీపీఎం తెలిపింది.
Next Story

