Sun Feb 01 2026 16:30:40 GMT+0000 (Coordinated Universal Time)
ఐదింటిలో మోదీ ఓటమి ఖాయం.. రాజా జోస్యం
వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వస్తాయని సీీపీఐ నేత డి రాజా అన్నారు

వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వస్తాయని సీీపీఐ నేత డి రాజా అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ నడుపుతుందని రాజా వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్లన్నింటిని ప్రయివేటీకరిస్తుందని, ఆర్ఎస్ఎస్ చెప్పనట్లే నడుచుకుంటుందని రాజా ఆరోపించారు.
సెక్యులర్ శక్తులన్నీ....
సెక్యులర్ శక్తులన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఏవిధంగా ఉండాలన్నది కీలకమన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని రాజా అభిప్రాయపడ్డారు. ఫాసిస్టు ప్రభుత్వాన్ని అందరూ వ్యతిరేకించాలని కోరారు.
Next Story

