Sun Mar 15 2026 11:52:54 GMT+0530 (India Standard Time)
ఉప రాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి హాజరైన జగదీప్ ధన్ ఖడ్
భారత ఉప రాష్ట్రపతి గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు

భారత ఉప రాష్ట్రపతి గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాధాకృష్ణన్ చేత రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అనేక మంది ముఖ్య నేతలు...
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ప్రమాణస్వీకారానికి వచ్చారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు మాజీ ఉప రాష్ట్రపతులు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరై భారత పదిహేడో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సీపీ రాధాకృష్ణన్ ను అభినందించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ కూడా హాజరయ్యారు.
Next Story

