Fri Dec 05 2025 16:51:41 GMT+0000 (Coordinated Universal Time)
PSLV-C61 ప్రయోగానికి కౌంట్ డౌన్
PSLV-C61 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది.

PSLV-C61 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరగనుంది. రేపు ఉదయం 5:59 గంటలకు రాకెట్ ప్రయోగం జరగనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో EOS-9 శాస్త్రవేత్తలు రూపొందించారు. కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
నెలకు ఒకటి...
రేపు PSLV-C61 ప్రయోగం జరుగుతుండటంతో ఇస్రో చైర్మన్ నారాయణన్ చెంగాలమ్మను దర్శించుకున్నారు. PSLV-C61 ప్రయోగం విజయవంతం కావాలని పూజలు నిర్వహించారు. వచ్చే నెలలో GSLV-F16 రాకెట్ ప్రయోగం నిర్వహించనున్నారు. ఈ ఏడాదిలో నెలకో రాకెట్ ప్రయోగం ఉంటుందని ఛైర్మన్ నారాయణన్ తెలిపారు.
Next Story

