Sat Dec 13 2025 19:20:24 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఎల్.వి.ఎం3 - 5 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్
నేడు ఎల్.వి.ఎం3 - 5 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.

నేడు ఎల్.వి.ఎం3 - 5 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. రేపు సాయంత్రం రాకెట్ ప్రయోగం జరగనుంది. ఇస్రో నేతృత్వంలో తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ రాకెట్ ప్రయోగంతో పాటు సీఎంఎస్ -3 ఉపగ్రహాన్ని కూడా అంతరిక్షంలోకి పంపనుంది.
మల్టీ బ్యాండ్ కమ్యునికేషన్...
ఈ సీఎంఎస్ ఉపగ్రహం బరువు 4,410 కిలోలని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం 3.26 గంటలకు ఈ రాకెట్ కు సంబంధించిన కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ఇస్రో శాస్త్రవేత్తలు తొలిసారిగా అత్యంత బరువైన ఉప గ్రహాన్ని భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. మల్టీ బ్యాండ్ కమ్యునికేషన్ శాటిలైట్ ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
Next Story

