Thu Dec 11 2025 01:35:32 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
నిన్న మొన్నటి వరకూ కొంత తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా మరోసారి భారత్ లో విజృంభిస్తున్నట్లే కన్పిస్తుంది

నిన్న మొన్నటి వరకూ కొంత తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా మరోసారి భారత్ లో విజృంభిస్తున్నట్లే కన్పిస్తుంది. కేసులు సంఖ్య పెరిగినా మరణాల సంఖ్య తగ్గడం కొంత ఊరట కల్గిస్తుంది. 24 గంటల్లో భారత్ లో 2,745 మంది కరోనా సోకిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత రెండు రోజులతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా పెరిగినట్లేనని అధికారులు చెబుతున్నారు.
మరణాల సంఖ్య మాత్రం.....
అయితే మరణాల సంఖ్య మాత్రం నేడు తగ్గింది. ఆరుగురు మాత్రమే మృతి చెందారు. 2,236 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో భారత్ లో ఇప్పటి వరకూ నమోదయిన కరోనా కేసుల సంఖ్య 4,31,60,832కు చేరుకుంది. 5,24,636 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 18,386గా ఉంది. 4,26,17,810 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1,93,57,20,807 మందికి వ్యాక్సినేషన్ వేశారు.
Next Story

