Mon Dec 08 2025 22:19:43 GMT+0000 (Coordinated Universal Time)
తగ్గని కేసులు.. సర్వత్రా ఆందోళన
భారత్ లో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. అన్ని రాష్ట్రాలకు కరోనా విస్తరిస్తుంది

భారత్ లో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. అన్ని రాష్ట్రాలకు కరోనా విస్తరిస్తుంది. ఫోర్త్ వేవ్ ప్రారంభం కాబోతుందన్న వైద్య నిపుణుల హెచ్చరికలు వాస్తవ రూపం దాల్చేనట్లే కనపడుతున్నాయి. ఒక్కరోజులో 18,840 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 43 మంది మరణించారు. ఇటీవల కాలంలో మృతుల సంఖ్య ఇదే అధికం. అయితే ఒక్కరోజులో 16,404 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కోలుకున్న వారి శాతం 98.51 శాతంగా నమోదయింది.
రోజు వారీ పాజిటవిటీ శాతం...
యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల శాతం 0.29 గా నమోదయిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. రోజు వారీ పాజిటవిటీ రేటు 4.14 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా నుంచి 4,29,53,980 మంది కోలుకున్నారు. భారత్ లో ఇప్పటివరకూ 5,25,386 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 1,25,028 యాక్టివ్ కేసులున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఇప్పటి వరకూ భారత్ లో 1,98,65,36,288 వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
Next Story

