Mon Dec 08 2025 21:22:08 GMT+0000 (Coordinated Universal Time)
ఒక్కరోజులో పెరిగిన కేసులు
భారత్ లో భారీగా కరోనా కేసులు పెరిగాయి. ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

భారత్ లో భారీగా కరోనా కేసులు పెరిగాయి. ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరోజులోనే 20,139 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 38 మంది కరోనాతో మరణించారు. నిన్న ఒక్కరోజులో కరోనా నుంచి 16,482 మంది కోలుకున్నారు. కోలుకునే వారి శాతం తగ్గుతుండటం గమనార్హం. ప్రస్తుతం భారత్ లో కోలుకునే వారి శాతం 98.49 శాతంగా ఉంది.
రోజువారీ పాజిటివిటీ రేటు....
ఇక రోజువారీ పాజిటివిటీ రేటు పెరుగుతుంది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 5.1 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసుల సంఖ్య శాతం కూడా 0.31 కు పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా దేశంలో 5,25,557 మంది మరణించారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 4,30,28,356 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,36,076గా ఉంది.
Next Story

