Mon Dec 08 2025 19:57:21 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో భారీగా పెరిగిన కేసులు
భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకూ 20 వేల కేసులు నమోదవుతుండగా, ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది

భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకూ 20 వేల కేసులు నమోదవుతుండగా, ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది. ఒక్కరోజులోనే 21,566 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 45 మంది కరోనా కారణంగా మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజులోనే 18,294 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. కోలుకునే వారి శాతం 98.47 శాతంగా నమోదయింది. రోజు వారీ పాజిటివిటీ రేటు పెరుగుతుండటం విశేషం ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 4.25 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
మరణాలు...
దేశంలో ఇప్పటి వరకూ 4,38,25,185 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిలో 4,31,50,434 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 1,48,881 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ దేశంలో కరోనా కారణంగా 5,25,870 మంది మరణించారు. కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 200 కోట్లు దాటింది. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కోరుతున్నారు. కేసుల పెరుగుతున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచనలు చేస్తుంది.
Next Story

