Tue Dec 09 2025 10:13:10 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ ను బెంబేలెత్తిస్తున్న కరోనా
భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజగా 12,213 మంది వైరస్ బారిన పడ్డారు. 11 మంది మరణించారు.

భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజగా 12,213 మంది వైరస్ బారిన పడ్డారు. 11 మంది మరణించారు. గత ఆరు నెలల్లో పదివేలు దాటడం ఇదే తొలిసారి. అయితే 7,624 మంది ఒకరోజులో కోలుకున్నారు. కోలుకున్న వారి శాతం 98.66 శాతంగా, మరణాల శాతం 1.21 శాతంగా ఉన్నప్పటికీ రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రాలకు మార్గదర్శకాలను ఇవ్వాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.
పాజిటివిటీ రేటు...
ప్రస్తుతం రోజు వారీ పాజిటివిటీ రేటు 2.35 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో ఈరోజు వరకూ 43,257,730 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 5,24,803 మృతి చెందారు. యాక్టివ్ కేసులు 58,215 గా ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4,26,74,712 గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, కర్ణాటకలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.
నిబంధనలను...
కోవిడ్ నిబంధనలు ప్రజలు పాటించకపోతే ఖచ్చితంగా కరోనా మళ్లీ విజృంభిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భౌతిక దూరాన్ని పాటించడం, మాస్క్ ను, శానిటైజర్ ను ఖచ్చితంగా ఉపయోగించాలని చెబుతున్నారు. అయినా ప్రజలు మాత్రం లెక్క చేయడం లేదు. వ్యాక్సిన్ వేయించుకున్న ధీమాతో బయట తిరుగుతున్నారు. దీంతో కరోనా వ్యాప్తి మరింత ఎక్కువయ్యే అవకాశముంది. ఈరోజు వరకూ దేశంలో 1,95,67,37,014 వ్యాక్సిన్ డోసులు వేశారు.
Next Story

