Sun Mar 29 2026 07:00:34 GMT+0530 (India Standard Time)
నేడు కూడా ఆరువేలకు చేరువలో కరోనా కేసులు
భారత్లో 24 గంటల్లో కరోనా కేసులు భారీగానే నమోదయ్యాయి. 5,880 కరోనా కేసులు నమోదయ్యాయి. 14 మంది మరణించారు

భారత్ లో గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు భారీగానే నమోదయ్యాయి. 5,880 కరోనా కేసులు నమోదయ్యాయి. 14 మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దాదాపు ఆరు వేల కేసులు నమోదు కావడం ఆందోళన కల్గించే విషయమేనని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు.
మాక్ డ్రిల్...
దీంతో భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 35 వేలకు దాటింది. రోజురోజుకూ యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలను కఠినతరం చేయాలని భావిస్తుంది. ఈరోజు దేశంలో మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రేపు అన్ని ఆసపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించి, టెస్ట్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Next Story

