Mon Dec 08 2025 15:53:01 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో తగ్గని కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు తగ్గడం లేదు. రోజుకు పది వేల మందికి పైగా కరోనా బారిన పడుతున్నారు.

భారత్ లో కరోనా కేసులు తగ్గడం లేదు. రోజుకు పది వేల మందికి పైగా కరోనా బారిన పడుతున్నారు. ఒక్కరోజులోనే 13,084 కరోనా కేసులు నమోదయ్యాయి. 36 మంది కరోనా కారణంగా ప్రారంభించారు. నిన్న ఒక్కరోజులోనే 13,084 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.60 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసులు 0.21 శాతంగా నమోదయింది.
వ్యాక్సినేషన్....
ఇప్పటి వరకూ దేశంలో 4,43,78,920 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ దేశంలో 4,37,57,385 కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ 5,27,488 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 94,047 గా ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం 210 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
Next Story

