Fri Dec 05 2025 22:05:53 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : భారత్లో భారీగా కరోనా కేసులు
భారత్ లో భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో భారత్ లో 5.353 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

భారత్ లో భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో భారత్ లో 5.353 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. గత కొద్ది రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. వెయ్యి నుంచి రోజుకు మొదలై ప్రస్తుతం ఐదు వేలకు చేరుకోవడం కలవరపరిస్తుంది. దీంతో అన్ని రాష్ట్రాలను ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అలర్ట్ చేశారు.
మాస్క్లు కంపల్సరీ...
ప్రస్తుతం దేశంలో 25,587 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కేసుల పాజిటివిటీ శాతం పెరుగుతందని చెబుతున్నారు. గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, కేరళలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, ప్రజలు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరుతున్నారు. ఖచ్చితంగా మాస్క్లు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తేనే కరోనాను నియంత్రించగలమని చెబుతున్నారు.
- Tags
- corona virus
Next Story

