Tue Jul 08 2025 17:39:21 GMT+0000 (Coordinated Universal Time)
Corona Virus : మాస్క్ లు మస్ట్.. లేకుంటే వైరస్ ఒంట్లోకి చొరబడటం ఖాయం
కరోనా వైరస్ కేసులు భారత్ లో పెరుగుతున్నాయి. ప్రతి రోజూ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి

కరోనా వైరస్ కేసులు భారత్ లో పెరుగుతున్నాయి. ప్రతి రోజూ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. రోజుకు యాక్టివ్ కేసుల సంఖ్య ట్రిపుల్ అవుతున్నాయి. నిన్న మూడు వందలకు పైగా కేసులు నమోదయితే ఈరోజు వెయ్యికి పైగానే కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా వ్యాప్తి ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో ఇట్టే అర్థమవుతుంది. చలిగాలులు ప్రవేశించడంతో పాటు నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు పడటంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, బయటకు వెళ్లివచ్చినప్పడు శానిటైజర్ తో చేతులు శుభ్రపర్చుకోవాలని, లేకుంటే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్యులు తెలిపారు.
కొత్తగా ఇరవై నాలుగు గంటల్లో...
ఈరోజు దేశంలో 378 కొత్త గా కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో భారత్ లో కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య 6,133 కు చేరింది. గత ఇరవై నాలుగు గంటల్లో కరోనా వైరస్ కారణంగా ఆరుగురు మరణించడం కూడా ఆందోళనకు దారి తీసింది. ఇప్పటి వరకూ భార్ లో కరో్నా వైరస్ తో మరణించిన వారి సంఖ్య 65కు చేరింది. ఈ ఏడాది జనవరి నుంచి కరోనా వైరస్ భారత్ లో ప్రారంభమయినప్పటికీ మే 25వ తేదీ నుంచి వేగంగా వ్యాప్తి చెందుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాదు ప్రజలు కూడా కరో్నా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
యాక్టివ్ కేసులు ఎక్కువగా...
ప్రధానంగా దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు సామూహికంగా ప్రజలు గుమిగూడే ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిదని సూచించారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లినా మాస్క్ లను మస్ట్ గా ధరించాలని, లేకుంటే వైరస్ సులువుగా సోకుతుందని చెప్పారు. ఇమ్యునిటీ తక్కువగా ఉన్న వారికి ఎక్కువగా వైరస్ సోకుతుందని కూడా వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం కేరళలో అత్యధికంగా 1,950 కరోనా వైరస్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా పెరుగుతుందని, ప్రభుత్వాలు కూడా ప్రజల్లో అవగాహన పెంచాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
Next Story