Sun Dec 14 2025 19:26:59 GMT+0000 (Coordinated Universal Time)
Corona Virus : కేసులు తగ్గడం లేదు.. మరణాలు ఆగడం లేదు
భారత్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడచిన ఇరవై నాలుగు గంటలలో దేశంలో 760 కొత్త కేసులు నమోదయ్యాయి

భారత్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడచిన ఇరవై నాలుగు గంటలలో దేశంలో 760 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇద్దరు కరోనా వైరస్ కారణంగా మృతి చెందారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4423 కు చేరిందని అధికారులు తెలిపారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇద్దరు కరోనా కారణంగా మరణించారు.
జెఎన్ 1 వేరియంట్ కేసు కూడా...
అలాగే దేశంలో జేఎన్ 1 వేరియంట్ కేసులు కూడా పెరుగుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో జేఎన్ 1 వేరియంట్ కేసుల సంఖ్య 511కు చేరుకుంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ రకమైన కేసులు కేరళలో 148, గోవాలో 48, గుజరాత్ లో 36, మహారాష్ట్రలో 32, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, తెలంగాణలో రెండు, ఒడిశా, హర్యానాలో ఒక్కొక్క కేసు నమోదయింది.
Next Story

