Wed Mar 25 2026 18:01:18 GMT+0530 (India Standard Time)
ఢిల్లీలో హై అలర్ట్ : కరోనా కేసులు
కరోనా కేసులు ఢిల్లీలో పెరుగుతున్నాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమయింది.

కరోనా కేసులు ఢిల్లీలో పెరుగుతున్నాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమయింది. అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేశారు. గడిచిన 24 గంటల్లో 293 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. దీంతో ఢిల్లీ అధికార వర్గాల్లో కలకలం రేగింది.
ఇద్దరు మృతి...
ఇద్దరు కరోనా కారణంగా మరణించడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఢిల్లీలో ప్రస్తుతం 1,406 యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ XBB.1.16తో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
Next Story

