Sun Mar 29 2026 08:32:24 GMT+0530 (India Standard Time)
యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయ్
దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 1,805 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 1,805 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న కూడా ఇదే స్థాయిలో కేసులు నమోదవ్వడంతో నేడు అత్యవసర సమావేశం రాష్ట్రాలతో ఏర్పాటు చేసింది.
కేంద్రం అప్రమత్తం...
క్రియాశీల కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం పది వేల కేసులకు పైగానే యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కరోనా కారణంగా గత 24 గంటల్లో ఆరుగురు మరణించారు. ఈరోజు రికవరీ రేటు 98.79 శాతంగా నమోదయింది.
Next Story

