Sun Mar 29 2026 08:31:15 GMT+0530 (India Standard Time)
Corona : దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా
దేశంలో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇరవై నాలుగు గంటల్లో 1300 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.

దేశంలో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇరవై నాలుగు గంటల్లో 1300 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనాతో ముగ్గురు మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. నాలుగు నెలల తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది.
కేంద్రం అలర్ట్...
నిన్న ఒక్కరోజులో కరోనా చికిత్స పొందుతూ 718 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ దేశంలో 4,46,99,418 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకూ దేశంలో 5,30,816 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 7,605 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ కరోనా సోకి 4,41,60,997 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.79 శాతంగా నమోదయింది.
Next Story

