Mon Dec 08 2025 17:38:01 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో భారీగా తగ్గిన కేసులు
భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. రోజుకు 20 వేలకు పైగా నమోదవుతున్న కేసులు ప్రస్తుతం కొంత తగ్గుతున్నాయి.

భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. రోజుకు 20 వేలకు పైగా నమోదవుతున్న కేసులు ప్రస్తుతం కొంత తగ్గుతున్నాయి. ఒక్కరోజులోనే 12,751 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 42 మంది కరోనా కారణంగా మరణించారు. నిన్న ఒక్కరోజులోనే 16,412 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రికవరీ రేటు 98.51 శాతంగా నమోదయిందని చెప్పారు.
అయినా ప్రజలు..
కేసుల సంఖ్య తగ్గుతున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనంటున్నారు. వైరస్ వ్యాప్తి ఎప్పుడైనా వేగవంతమయ్యే అవకాశముందని అంటున్నారు. ప్రస్తుతం పాజిటవిటీ రేటు దేశంలో 3.50 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసుల 0.30 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
మరణాల సంఖ్య....
మరో వైపు ఇప్పటి వరకూ దేశంలో 4,41,74,650 మంది కరోనా కారణంగా మరణించారు. వీరిలో 4,35,16,071 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 5,26,772 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,31,807 యాక్టివ్ కేసులున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
Next Story

