Mon Feb 02 2026 16:44:02 GMT+0000 (Coordinated Universal Time)
సౌరవ్ గంగూలీకి కరోనా
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ లు చేయించుకున్నారు

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ లు చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ గా తేలింది. వెంటనే గంగూలీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే గంగూలీకి స్వల్పంగానే లక్షణాలున్నాయని, త్వరలోనే కోలుకుంటారని ఆసుపత్రి వైద్యులు చెప్పారు.
కుటుంబ సభ్యులు సయితం....
మరోవైపు సౌరవ్ గంగూలీ కుటుంబ సభ్యులు సయితం కరోనా బారిన పడ్డారు. గతంలోనూ సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్ గా తేలింది. చికిత్స పొందారు. ఆయన గుండెపోటు స్వల్పంగా రావడంతో ఆసుపత్రి పాలయ్యారు. మరోసారి కోవిడ్ సోకడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Next Story

