Wed Dec 17 2025 08:44:48 GMT+0000 (Coordinated Universal Time)
Corona : ఒక్కరోజులోనే 38 మంది మృతి
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 10,542 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 10,542 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా దేశంలో 38 మంది ఒక్కరోజులోనే మరణించారని తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కోవిడ్ నిబంధనలు పాటించాలని, వ్యాక్సినేషన్ ముమ్మరం చేయాలని ఆదేశించింది.
యాక్టివ్ కేసులు కూడా...
ప్రస్తుతం భారత్ లో కరోనా యాక్టివ్ కేసులు 65,562కు చేరుకున్నాయి. రోజువారీ పాజిటివిటీ శాతం 4.39 శాతంగా నమోదయిందదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. వారంలో 5.14 పాజిటివిటీ రేటు నమోదయిందని తెలిపారు. ఇప్పటి వరకూ 4,48,45,401 మంది కరోనా వైరస్ బారిన పడ్డారని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిపింది.
Next Story

