Thu Mar 19 2026 08:01:31 GMT+0530 (India Standard Time)
గ్రేట్ రిలీఫ్... భారత్ లో కరోనా....?
భారత్ లో కరోనా క్రమంగా కనుమరుగవుతుంది. కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 34,113 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

భారత్ లో కరోనా క్రమంగా కనుమరుగవుతుంది. కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 34,113 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 346 మంది మరణించారు. మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,16,77,641 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 4,78,882 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,26,65,534 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,09,011 మంది మరణించారు. కరోనా పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ దేశంలో 1,72,95,87,490 మందికి కరోనా వ్యాక్సినేషన్ జరిగింది
Next Story

