Wed Mar 18 2026 18:19:20 GMT+0530 (India Standard Time)
భారత్ లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 1,335 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

ఇండియా : భారత్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 1,335 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 52 మంది మరణించారు. మరణాల సంఖ్య కూడా పెరిగింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,90,922 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు...
యాక్టివ్ కేసులు బాగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 13,672 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,30,25,775 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,21,181 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,84,31,89,377 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు. యాక్టివ్ కేసులు 0.03 శాతానికి చేరాయి.
Next Story

