Wed Mar 18 2026 15:21:14 GMT+0530 (India Standard Time)
భారత్ లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు కూడా స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 1,150 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇండియా : భారత్ లో కరోనా కేసులు ఈరోజు కూడా స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 1,150 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 83 మంది మరణించారు. మరణాల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,25,01,196 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు...
యాక్టివ్ కేసులు కూడా బాగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 11,365 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,30,34,217 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,21,656 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,85,55,07,490 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు. రికవరీ రేటు 98.76 శాతంగా నమోదయింది.
Next Story

