Wed Mar 18 2026 16:44:03 GMT+0530 (India Standard Time)
భారత్ లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,260 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇండియా : భారత్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,260 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 83 మంది మరణించారు. మరణాల సంఖ్య బాగా పెరిగింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,92,326 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
వ్యాక్సినేషన్...
యాక్టివ్ కేసులు బాగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 13,445 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,30,27,035 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,21,264 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,84,52,44,856 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు. యాక్టివ్ కేసులు 0.03 శాతానికి చేరాయి.
Next Story

