Fri Dec 05 2025 18:04:29 GMT+0000 (Coordinated Universal Time)
బ్యాడ్ న్యూస్... భారత్ లో భారీగా మరణాలు
భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 8,895 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,796 మంది మరణించారు

భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 8,895 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,796 మంది మరణించారు. ఇంత పెద్దసంఖ్యలో కరోనాతో మరణించడం నాలుగు నెలల తర్వాత ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,46,33,255 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 99,155 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
మరణాల సంఖ్య...
భారత్ లో ఇప్పటి వరకూ 3,47,15,757 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,73,326 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,27,61,83,065 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
- Tags
- corona viurs
- inda
Next Story

