Wed Mar 18 2026 13:33:03 GMT+0530 (India Standard Time)
నేడు నెమ్మదించిన కరోనా
భారత్ లో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. 24 గంటల్లో భారత్లో భారత్లో 9,111 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

భారత్ లో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఇప్పటి వరకూ రోజుకు పది వేలకు పైగా నమోదయిన కేసులు గడచిన 24 గంటల్లో తొమ్మిది వేలు మాత్రమే నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో భారత్లో భారత్లో 9,111 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కేసుల సంఖ్య తగ్గినట్లు కాదని, ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
యాక్టివ్ కేసుులు...
ప్రస్తుతం భారత్లో యాక్టివ్ కేసులు 60,313కు చేరుకున్నాయి. వీరంతా ఆసుపత్రుల్లో కొందరు, మరి కొందరు ఇంటివద్దే ఉండి చికిత్స పొందుతున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రజలు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు కూడా శానిటైజర్ వాడకం పెంచాలని భారత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. లేకుంటే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
Next Story

