Wed Mar 18 2026 23:24:57 GMT+0530 (India Standard Time)
భారత్ లో తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు కొంచెం తగ్గాయి. ఈరోజు కొత్తగా 2,539 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 60 మంది మరణించారు.

ఇండియా : భారత్ లో కరోనా కేసులు కొంచెం తగ్గాయి. ఈరోజు కొత్తగా 2,539 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 60 మంది మరణించారు. మరణాల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,54,546 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 30,799 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,30,01,477 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,16,132 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,80,80,24,147 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
Next Story

