Fri Mar 20 2026 06:30:46 GMT+0530 (India Standard Time)
భారత్ లో ఈరోజు తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు తగ్గాయి. ఈరోజు కొత్తగా 6,358 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

భారత్ లో కరోనా కేసులు ఈరోజు తగ్గాయి. ఈరోజు కొత్తగా 6,358 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలీస్తే కేసుల సంఖ్య తగ్గింది. 293 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,42,43,945 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 76,766 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
యాక్టివ్ కేసులు...
భారత్ లో ఇప్పటి వరకూ 3,47,36,049 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,80,982 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,41,73,76,774 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
Next Story

