Thu Mar 19 2026 17:40:40 GMT+0530 (India Standard Time)
భారత్ లో ఈరోజు స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా తగ్గాయి.కొత్తగా 3,37,404 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 488 మంది మరణించారు.

భారత్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 3,37,404 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 488 మంది మరణించారు. మరణాల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,62,91,435మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు కూడా...
ప్రస్తుతం దేశంలో 21,13,365 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 3,89,03,748 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,88,884 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,61,,66, 44674 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది. దేశంలో ఇప్పటి వరకూ 10,050 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ రేటు 17.22 శాతంగా ఉంది.
Next Story

