Thu Mar 19 2026 16:05:35 GMT+0530 (India Standard Time)
ఐదు రోజుల తర్వాత రిలీఫ్.. భారత్ లో తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 2,55,874 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

భారత్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 2,55,874 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదు రోజుల తర్వాత మూడు లక్షల దిగువన కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. 614 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,70,71,898 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు కూడా...
ప్రస్తుతం దేశంలో 22,36,842 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 3,97,99,202 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,90,462 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,63,66, 44674 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
Next Story

