Thu Mar 19 2026 02:11:31 GMT+0530 (India Standard Time)
ఇండియా కరోనా అప్డేట్
భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 5,921 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 289 మంది మరణించారు.

ఇండియా : భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 5,921 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 289 మంది మరణించారు. మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,23,78,721 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 63,878 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,29,45,284 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,14,878 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,78,55,66,940 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
Next Story

