Thu Mar 19 2026 12:36:28 GMT+0530 (India Standard Time)
భారత్ లో బాగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,67,059 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

భారత్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,67,059 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య బాగా పెరిగింది. ఈరోజు1,192 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,92,60,710 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తగ్గుతున్న యాక్టివిటీ కేసులు...
ప్రస్తుతం దేశంలో 17,47937 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,14,58,241 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,96,242 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,66,58,44,536 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
Next Story

