Wed Mar 18 2026 20:04:09 GMT+0530 (India Standard Time)
భారత్ లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,685 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 83 మంది మరణించారు

ఇండియా : భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,685 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 83 మంది మరణించారు.. మరణాల సంఖ్య మాత్రం బాగా పెరిగింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,78,087 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మరణాలు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 21,530 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,30,16,372 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,16,755 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,82,55,75,126 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు. దేశంలో పాజిటివిటీ రేటు 0.24 శాతంగా నమోదయింది.
Next Story

