Wed Mar 18 2026 20:07:24 GMT+0530 (India Standard Time)
భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,421 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 149 మంది మరణించారు

ఇండియా : భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,421 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 149 మంది మరణించారు.. మరణాల సంఖ్య వందను దాటడం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,82,262 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు ఇరవై వేలకు దిగువన....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఇరవై వేలకు దిగువకు చేరుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 16,187 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,30,19,453 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,21,004 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,83,20,10,030 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
Next Story

