Wed Mar 18 2026 18:17:44 GMT+0530 (India Standard Time)
భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,270 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇండియా : భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,270 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చాలా రోజుల తర్వాత 1500 కు దిగువన కేసులు నమోదయ్యాయి. 31మంది మరణించారు.. మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,83,829 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు...
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఇరవై వేలకు దిగువకు చేరుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 1,5859 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,30,20,723 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,21,035 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,83,26,35,673 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
Next Story

